నాని ఒక్క ప్రశ్న వేస్తే…?

రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు ప్రకారం శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం రాష్ట్ర పరిధిలోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శాంతి భద్రతల నిర్వహణ ప్రాథమిక బాధ్యత [more]

Update: 2020-02-04 13:30 GMT

రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు ప్రకారం శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం రాష్ట్ర పరిధిలోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శాంతి భద్రతల నిర్వహణ ప్రాథమిక బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి లోక్ సభలో చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే బాధ్యత కూడా రాష్ట్రాలదేనని మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుందన్నరాు. రాష్ట్రం కోరితే అవసరమైతే కేంద్రం అదనపు బలగాలను పంపించి సహకరిస్తుందన్నారు. ఇంత వరకు అదనపు బలగాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన తమకు రాలేదని ఆయన చెప్పారు. అమరావతిలో జరుగుతున్న ప్రజా ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో కేంద్రం ఈ మేరకు జోక్యం చేసుకుంటుంది? అన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నలకు కేంద్రమంత్రి నుంచి ఈ సమాధానం వచ్చింది.

Tags:    

Similar News