ఎట్టకేలకు గెలిచిన కేజ్రీవాల్

Update: 2018-07-04 06:56 GMT

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతున్న అధికారాల వివాదానికి సుప్రీం కోర్టు పరిష్కరం చెప్పింది. ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ లు సఖ్యతతో పనిచేయాలని, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ తో విభేదాల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. తమ అధికారాలను ఎల్జీ తుంగలో తొక్కుతున్నారని, పెత్తనం చెలాయిస్తున్నారని కోర్టుకు విరవించారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర సంబంధాలు ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేయాల్సి ఉంటుందని, అదే సమయంలో కేబినెట్ నిర్ణయాలను ప్రభుత్వ లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలియజేయాలని సూచించింది. మంత్రి మండలి నిర్ణయాలను ఎల్జీ అడ్డుకోవద్దని సూచించింది. దీంతో అధికారాల పోరులో ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ గెలిచినట్లే కనపడుతోంది.

Similar News