బ్రేకింగ్ : కలెక్టర్ పై బదిలీ వేటు

కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై బదిలీ వేటు పడింది. గత కొంతకాలంగా మంత్రి గంగుల కమలాకర్ కు, కలెక్టర్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్నికల [more]

Update: 2019-12-16 06:37 GMT

కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై బదిలీ వేటు పడింది. గత కొంతకాలంగా మంత్రి గంగుల కమలాకర్ కు, కలెక్టర్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ తో కలెక్టర్ సర్ఫరాజ్ మాట్లాడిన ఆడియో టేపులు కలకలం రేపాయి. అయితే దీనిపై సర్పరాజ్ ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకున్నారు. కావాలని కొందరు కలెక్టర్ పైన, తనపైన బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అయితే చివరకు కలెక్టర్ సర్ఫరాజ్ ను కరీంనగర్ నుంచి బదిలీ చేసింది. కరీంనగర్ కు చెందిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కలెక్టర్ పై ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కొత్త కలెక్టర్ గా శశాంక్ ను నియమిస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News