కొత్త బిల్లులు ఇప్పట్లో రావడం కష్టమేనా?

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను మార్పులు చేసి పెట్టడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు.

Update: 2021-12-27 07:00 GMT

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను మార్పులు చేసి పెట్టడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. న్యాయస్థానంలో ఉన్న ఈ కేసు విచారణ వాయిదా పడుతుండటంతో తాను అనుకున్న సమయానికి జగన్ కొత్త బిల్లులను పెట్టే అవకాశం లేదు. జగన్ ఇటీవల మూడు రాజధానుల బిల్లులతో పాటు, సీఆర్టీఏ రద్దు బిల్లును కూడా వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్త బిల్లులను తెస్తామని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారు.

మార్పులు చేసి తెస్తామని....
పాలనా వికేంద్రీకరణ బిల్లులను మార్పులు చేసి జగన్ తేనున్నారు. ఇప్పటికే అధికారులు, న్యాయనిపుణులతో కలిసి బిల్లుల రూపొందించే పనిలో ఉన్నారు. బహుశ కొత్త ఏడాది కొత్త బిల్లులను అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని జగన్ భావించారు. కానీ అది సాధ్యం అయ్యేటట్లు లేదు. మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతుండటమే ఇందుకు కారణం.
ప్రభుత్వం వెనక్కు తీసుకున్నా....
మూడు రాజధానుల బిల్లులను, సీఆర్టీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకున్న తర్వాత ఇక కోర్టులో విచారణ లేదన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. ఆ పిటీషన్లకు జీవోలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతోనే చెల్లకుండా పోయినట్లేనని చెబుతున్నారు. ఆ విచారణను క్లోజ్ చేస్తారని భావించారు. కానీ హైకోర్టులో మాత్రం ఇంకా మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దుపై వాయిదాల పర్వం కొనసాగుతుంది.
వాయిదాలతోనే....
తాజాగా ఈరోజు మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై విచారణను హైకోర్టు వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మొత్తం 70కి పైగా దాఖలయిన పిటీషన్లను విచారించవలసి ఉందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకున్నా విచారణ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని పిటీషనర్లు కోరాు. దీనిపై విచారించిన హైకోర్టు విచారణను వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఇక అప్పటి వరకూ కొత్త బిల్లులను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం లేదు.


Tags:    

Similar News