ఈ ఏడాది విద్యుత్తు కోతలు తప్పేట్లు లేవ్

ఎన్నికల సంవత్సరం అధికార బీఆర్ఎస్ కువిద్యుత్తు ప్రధాన అంశంగా మారనుంది. గత ఎనిమిదేళ్ల నుంచి లేని సమస్య ఈ ఏడాది తలెత్తనుంది

Update: 2023-02-23 04:05 GMT

ఎన్నికల సంవత్సరం అధికార బీఆర్ఎస్ పార్టీకి విద్యుత్తు ప్రధాన అంశంగా మారనుంది. గత ఎనిమిదేళ్ల నుంచి లేని సమస్య ఈ ఏడాది తలెత్తనుంది. ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తు కోతలు ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు కోతలను అనధికారికంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరంలోనూ మెయిన్‌టెయినెన్స్ పేరుతో విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నారు.

మెయిన్‌టెయినెన్స్ పేరుతో...
సాధారణంగా చెట్లను కొట్టివేయడానికి, మెయిన్‌టెయిన్స్ నిమిత్తం విద్యుత్తు శాఖ ఆరు నెలలకు ఒకసారి నాలుగైదు గంటల పాటు సబ్ స్టేషన్ల వారీగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది. ఎండాకాలానికి ముందే ఈ మెయిన్‌టెయిన్స్ పనులను విద్యుత్తు శాఖ అధికారులు నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నెల మొదటి నుంచే మెయిన్‌టెయినెన్స్ పనులు ప్రారంభమయ్యాయని చెబుతూ విద్యుత్తు కోతలను విధిస్తున్నారు. నెలకు ఒకసారి మెయిన్‌టెయినెన్స్ అంటూ కోతలు విధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లనే విద్యుత్తు కొరత ఏర్పడిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
రోడ్డెక్కుతున్న రైతులు...
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు కోతల కారణంగా రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు అందిస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో దెబ్బతీసేందుకే కేంద్రం విద్యుత్తును తమకు కేటాయించడం లేదని కేసీఆర్ ప్రభుత్వం చెబుతుంది. మొత్తం మీద ఈ ఏడాది తెలంగాణలో విద్యుత్తు కోతలు తీవ్రంగానే ఉండే అవకాశముందిని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News