బ్రేకింగ్ : ఏపీలో కరోనాలో కొత్త సమస్య
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల విషయంలో కొత్త సమస్య వచ్చింది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన ఓ వ్యక్తికి తిరిగి పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో ఈ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల విషయంలో కొత్త సమస్య వచ్చింది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన ఓ వ్యక్తికి తిరిగి పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో ఈ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల విషయంలో కొత్త సమస్య వచ్చింది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన ఓ వ్యక్తికి తిరిగి పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి నెల రోజుల క్రితం వైరస్ పరీక్షలు చేశారు. అందులో నెగిటివ్ వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన అనంతరం తిరిగి ఇళ్లకు పంపారు. ఇప్పుడు ఒక వ్యక్తికి తిరిగి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారందరికీ తిరిగి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాంటి కేసులు ఆరు నమోదయ్యాయి. దీంతో రెడ్ జోన్ లో నిబందనలను కఠినతరం చేసింది.