బ్రేకింగ్ : ఆ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలివ్వలేం

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆదేశాలివ్వలేమని హైకోర్టు చెప్పింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ను వెంటనే ఇవ్వాలంటూ దాఖలయిన అనుబంధ పిటీషన్లను హైకోర్టు [more]

Update: 2021-03-23 06:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆదేశాలివ్వలేమని హైకోర్టు చెప్పింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ను వెంటనే ఇవ్వాలంటూ దాఖలయిన అనుబంధ పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 30వ తేదీకి వాయిదా వేసింది. మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించాలని కోరుతుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడం లేదు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయినా హైకోర్టులో కూడా వెంటనే ఎన్నికలను నిర్వహించాలని ఆదేశివ్వలేమని చెప్పింది. ప్రధాన పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News