రోడ్డు మీదకు పోలీస్ కమిషనర్లు…. అర్థరాత్రి పర్యటన

లాక్ డౌన్ కొనసాగుతుంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ పెట్టారు. ప్రజలు ఎక్కడికక్కడే తమ ఇళ్లలోనే ఉండిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి. నిత్యం ప్రజల [more]

Update: 2020-04-08 12:03 GMT

లాక్ డౌన్ కొనసాగుతుంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ పెట్టారు. ప్రజలు ఎక్కడికక్కడే తమ ఇళ్లలోనే ఉండిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు రోడ్లమీద ఉండిపోతున్నారు. వారి సాధక బాధకాలను ఎవరు పట్టించుకోరు. అంతేకాకుండా రోడ్ల మీదికి వచ్చిన జనాలు పోలీసులపై . తిరగబడుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసులు తమ విధులను చక్క పెడుతున్నారు. అయితే పోలీసులు పడుతున్న బాధలు ఏంటి, పోలీసులు ఎలాంటి కష్టాల ఎదుర్కొంటున్నారు ప్రజల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది . ఇలాంటి వాటిపై తెలుసుకునేందుకు పోలీసు బాస్ లు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు పోలీస్ కమిషనర్లు రోడ్ల మీదికి వచ్చారు. హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ,రాచకొండ కమిషనర్ మహేష్ తమ తమ పరిధిలోని ప్రాంతాలను విజిట్ చేశారు.

కిందిస్థాయి పోలీసులు….

ఈ సందర్భంగా పోలీసులు ఎదుర్కొంటున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సకాలంలో మంచినీరు , ఫుడ్డు అందుతుందా లేదా? అన్న దితెలుసుకున్నారు. రోడ్లమీద విధులు నిర్వహిస్తున్న అధికారులు తింటున్న ఆహారం స్వయంగా తిన్నారు. రాత్రి సమయంలో కావలసిన సదుపాయాలను అడిగి ముగ్గురు కమిషనర్లు తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఉందని అధికారులు కమిషనర్లు దృష్టికి తీసుకువచ్చారు. అదే మాదిరిగా రోడ్లమీద టెంట్ వేసుకుని ఉంటున్నామని ఇక్కడ కనీస సదుపాయాలు కల్పించాలని కొందరు అధికారులు కమిషనర్లు దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా మంచినీరు సమస్యగా మారిందని వెల్లడించారు . అయితే రోడ్లమీద విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఇలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్లు అధికారులకు చెప్పారు. ప్రధానంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి విధుల్లో భాగంగానే సోషల్ డిస్టెన్స్ పాటించాలని పేర్కొన్నారు. ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని కోరారు. మరోవైపు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అర్ధరాత్రి సుడిగాలి పర్యటన చేశారు. పాత బస్తితో పాటు హైదరాబాద్ సెంటర్ లో పర్యటించారు. రోడ్డుమీద విధులు నిర్వహిస్తున్న అధికారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు . లాక్ డౌన్ తో పాటు కర్ఫ్యూ ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిజిపి చెప్పారు. పోలీస్ బాస్ లు అర్ధరాత్రి సమయంలో రోడ్లమీద పర్యటించడం కేటీఆర్ ట్విట్టర్ లో లైక్ చేశాడు.

Tags:    

Similar News