రేవంత్‌ పిటిషన్‌పై పోలీసులకు నోటీసులు

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై పోలీసులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాదాపూర్‌ ఏసీపీ శ్యామ్‌ ప్రసాద్‌ రావు, నార్సింగి [more]

Update: 2020-06-18 01:56 GMT

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై పోలీసులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాదాపూర్‌ ఏసీపీ శ్యామ్‌ ప్రసాద్‌ రావు, నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌కు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఫామ్‌హౌస్‌లో డ్రోన్‌లు వినియోగించానన్న ఆరోపణలపై తనను అరెస్టు చేయడంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌పై రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 5న తనను అరెస్టు చేసే ముందు నోటీసులు ఇవ్వలేదన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసి, నోటీసులు జారీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News