బ్రేకింగ్ : ఎన్నికల నిర్వహణపై విచారణ 25వ తేదీకి వాయిదా

జీహెచ్ఎంసీ ఎన్నికల పై ధాఖలైన పిటీషన్ ఈ నెల 25 కు హైకోర్టు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలయింది. దీనిపై [more]

Update: 2020-11-23 06:21 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల పై ధాఖలైన పిటీషన్ ఈ నెల 25 కు హైకోర్టు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలయింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 25వ తేదీన ఆన్ లైన్ ద్వారా విచారణ చేస్తామని చెప్పింది. రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో కాకుండా ఎన్నికలు నిర్వహిచడం చట్ట విరుద్ధమని బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 52ఇ రిజర్వేషన్ పాలసీకి విరుద్ధంగా ఉందని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ నెల 25వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News