బ్రేకింగ్ : నిమ్మగడ్డకు దొరకని రిలీఫ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై దాఖలైన పిటీషన్లపై హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు [more]

Update: 2020-04-13 06:25 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై దాఖలైన పిటీషన్లపై హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని పిటీషన్లను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా తొలగింపు రాజ్యంగా విరుద్ధమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నేత వర్లరామయ్య, న్యాయవాది యోగేశ్ లు పిటీషన్లను దాఖలు చేశారు. ఈ మూడు పిటీషన్లను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. తుది విచారణను వచ్చే సోమవారం చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రిలీఫ్ దొరకలేదు. ఏమైనా అభ్యంతరాలుంటే శుక్రవారం లోపు తెలపాలని పిటీషనర్లను హైకోర్టు కోరింది. గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News