ఆర్టీసీ బంతి మళ్లీ అక్కడికే

20 రోజులకు పైగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో జనం సతమతమవుతున్నారు. నిత్యం రోడ్లపై ఆర్టీసీ బస్సులులేక ఉద్యోగాలకు, పాఠశాలలకు, మార్కెట్లకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇటు ప్రభుత్వం, [more]

Update: 2019-10-26 13:14 GMT

20 రోజులకు పైగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో జనం సతమతమవుతున్నారు. నిత్యం రోడ్లపై ఆర్టీసీ బస్సులులేక ఉద్యోగాలకు, పాఠశాలలకు, మార్కెట్లకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు జేఏసీ నేతల పట్టులో చివరికి ప్రజలు సమిధలవుతున్నారు. సమ్మెపై హైకోర్టులోనూ ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

అర్థాంతరంగా….

చర్చలు ఎందుకు జరపడం లేదని, సెప్టెంబర్ నెల వేతనాలు కార్మికులకు ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు ఫలవంతమైన నిర్ణయాలతో విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో సర్కారు కోర్టు సూచనల మేరకే శనివారం జేఏసీ నేతలను చర్చలకు పిలిచింది. కాని అవి అర్ధాంతరంగా ముగిశాయి. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ యాజమాన్యం, మొత్తం డిమాండ్లపై చర్చించాలని ఆర్టీసీ జేఏసీ భీష్మించుకుని కూర్చోవడంతో చర్చలు ఫలించలేదు.

మళ్లీ జోక్యం చేసుకుంటేనే…

ఎవరికి వారు మంకి పట్టు పట్టుడంతో ఇప్పుడు మళ్లీ ఈ భారమంతా హైకోర్టుకే మళ్లింది. ఈ నెల 28న జరిగే విచారణలో హైకోర్ట్ ఏం చేస్తుందో చూడాలని జనం ఎదురుచూస్తున్నారు. బంతి కోర్టులో ఉండడంతో అందరి దృష్టి అక్కడికే మళ్లింది. కోర్టు సూచనలు, ఆదేశాలతో మళ్లీ బస్సులు రోడ్కెక్కతాయోమే వేచి చూడాల్సిందే.

 

Tags:    

Similar News