ఇంటలిజెన్స్ నివేదిక.. హై అలర్ట్

రేపు అమరావతిలో అలజడి జరిగే అవకాశముందని ఏపీ ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పోలీసులు రాజధాని ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపటి [more]

Update: 2020-01-19 12:14 GMT

రేపు అమరావతిలో అలజడి జరిగే అవకాశముందని ఏపీ ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పోలీసులు రాజధాని ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాజధాని అమరావతిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు యువకులు ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేపు జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పోలీసులు రాజధాని ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రేపు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే సమయంలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News