జిలేబీ బాబా దోషే.. తేల్చేసిన హర్యానా కోర్టు

జిలేబీ బాబా దోషి అని హర్యానా కోర్టు స్పష్టం చేసింది. ఆయనకు శిక్ష అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది

Update: 2023-01-10 08:13 GMT

జిలేబీ బాబా దోషి అని హర్యానా కోర్టు స్పష్టం చేసింది. ఆయనకు శిక్ష అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. దీంతో జిలేబీ బాబా బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 120 మంది మహిళలపై జిలేబీ బాబా అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులున్నాయి. మహిళలను ట్రాప్ చేసి అత్యాచారం కేసులో జిలేబీ బాబాను హర్యానా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ బాబా మహిళతో సన్నిహితంగా ఉన్న ఒక వీడియో వైరల్ కావడం, కొందరు తెగించి ఆయనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలు పేరు...
జిలేబీ బాబా అసలు పేరు అమర్ వీర్. పంజాబ్ లోని మాన్సా నుంచి హర్యానాలోని తోహానాకు ఇరవై ఏళ్ల క్రితం వచ్చాడు. తోహానా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణాన్ని తెరిచాడు. భార్య మరణించడంతో దుకాణాన్ని ఎత్తేశాడు. తర్వాత కొన్ని రోజులు అతను కన్పించలేదు. రెండు సంవత్సరాల తర్వాత తోహనాకు తిరిగి వచ్చి జిలేబీ బాబాగా అవతరించాడు. తనకు తాంత్రిక విద్యలు తెలుసునని నమ్మించాడు. దెయ్యాలు, భూతాలను తరిమికొడతానని ప్రజలను ఆకట్టుకున్నాడు. బాబా బాలక్ నాథ్ గుడిలో పూజారిగా పనిచేస్తూ గుడికి వచ్చిన మహిళలను ట్రాప్ చేయడం స్టార్ట్ చేశాడు.
120 మంది మహిళలను ట్రాప్ చేసి...
ట్రాప్ చేసిన మహిళలపై అత్యాచారానికి పాల్పడే జిలేబీ బాబా దానిని వీడియోలు తీసి భయపెట్టేవాడు. బెదిరించేవాడు. వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. దాదాపు 120 మందికి పైగా మహిళలు జిలేబీ బాబా అకృత్యాలకు బలయ్యారు. ఇక బాబా వేధింపులు తట్టుకోలేని కొందరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి, వీడియో క్లిప్పింగ్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హర్యానా కోర్టు జిలేబీ బాబాను దోషిగా నిర్ధారించింది. శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.


Tags:    

Similar News