రాజ్యసభలో జీవీఎల్ జువ్వలు ఇవే...!

Update: 2018-07-24 09:53 GMT

ఏపీకి ప్యాకేజీపై అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీ విభజన హామీల అంశంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రధాని ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. చాలా వరకూ హామీలను అమలు చేశామాన్నరు. ఏపీ ప్రజలను కొన్ని రాజకీయ పార్టీలు తప్పదోవ పట్టిస్తున్నాయన్నారు. ఏపీలో అధికార, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏపీపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అదికార పార్టీ ఈ విమర్శలకు దిగుతుందన్నారు. బీజేపీ వల్లనే ఏపీకి నిధులు వస్తున్నాయన్నారు.

బాబు స్వాగతించారు....

ప్రత్యేక ప్యాకేజీని అసెంబ్లీలోనే చంద్రబాబు స్వాగతించారన్నారు. హోదా ఉన్నా లేకపోయినా పరవాలేదన్నారు. నరేంద్ర మోడీ ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. మహానాడులో కూడా ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వల్లనే ఎక్కువ నిధులు వస్తాయని తీర్మానం చేశారన్నారు. బాధ్యతగా ఉండాల్సినపార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని జీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వల్ల 16,540 కోట్లు మాత్రమేనని, ప్రత్యేక ప్యాకేజీతో అంతకేంటే ఎక్కువ నిధులు వస్తాయని చంద్రబాబు చెప్పిన విషయాన్ని జీవీఎల్ నరసింహారావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఏడాది మేలో చెప్పిన ఈ మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. హోదా ఉన్న అన్ని రాష్ల్రాల్లో పూర్తిస్తాయిలో పన్ను రాయితీలు లేవన్నారు. ఏపీలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు రాయితీలు వర్తిస్తాయన్నారు. ఏపీకి రెండు ఇండ్రస్ట్రయల్ క్యారిడార్లు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా హామీలను అమలు చేస్తూ పోతుంటే....అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పోలవరం కాదని...అది మోదీ వరం అని ఆయన అన్నారు.

Similar News