కరోనా ఎఫెక్ట్… అలెర్ట్

తెలంగాణలో కరోనా వైరస్ తొలి కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుబాయ్ కు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత [more]

Update: 2020-03-03 04:36 GMT

తెలంగాణలో కరోనా వైరస్ తొలి కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుబాయ్ కు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత అతనికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. అక్కడ హాంకాంగ్ చెందిన వ్యక్తుల తో కలసి పనిచేయడం వల్ల కరోనా వైరస్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. పూణేకు నమూనాలు పంపి నిర్థారించుకున్న తర్వాత కరోనా వైరస్ సోకిందని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ తెలియజేసింది. అయితే కరోనా వైరస్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉప సంఘం మరికాసేపట్లో భేటీ కాబోతుంది. ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, ప్రజల్లో చైతన్య వంతుల్ని చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ లో కరోనా వైరస్ పై రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కరోనా వైరస్ పై మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు.

Tags:    

Similar News