సిద్ధిపేట జిల్లా పులకరించింది

సిద్ధిపేట జిల్లాకు గోదావరి జలాలు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయకి సాగర్ కు నీళ్లు చేరుకున్నాయి. రంగనాయక స్వామి ఆలయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు [more]

Update: 2020-04-24 07:06 GMT

సిద్ధిపేట జిల్లాకు గోదావరి జలాలు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయకి సాగర్ కు నీళ్లు చేరుకున్నాయి. రంగనాయక స్వామి ఆలయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పూజలు చేశారు. అనంతరం నీటిని విడుదల చేశారు. సిద్ధిపేట వాసుల చిరకాల స్వప్పం నేటికి నెరవేరింది. గోదావరి జలాల రాకతో సిద్ధిపేట జిల్లాలో తాగు, సాగు నీటి కొరత తీరనుంది. సిద్దిపేట జిల్లాలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయికి చేరుకున్నట్లయింది.

Tags:    

Similar News