మరోసారి ధ్వజమెత్తిన గల్లా

Update: 2018-08-09 12:43 GMT

కేంద్రప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోక తప్పదని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ జోస్యం చెప్పారు. ఈరోజు పార్లమెంటులో గల్లా మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఆర్థికంగా...అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందన్నారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సి ఉండగా ఏపీకి ఇవ్వకుండా పరిశ్రమలు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందన్నారు. అలాగే జీఎస్టీ కారణంగా ఏపీ సర్కార్ ఏటా 2600 కోట్లు నష్టపోతుందని ఆవేదన చెందారు. ఇప్పటివరకూ పైసా కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని గల్లా ధ్వజమెత్తారు.

Similar News