బ్యాక్ డోర్ పాలసీ ఎందుకు? ఈటల వ్యవహారంపై హైకోర్టు

ఈటల రాజేందర్ కుటుంబ భూముల వ్యవహారంపై రాజమార్గంలో విచారణ జరపాలని ,బ్యాక్ డోర్ పాలసీ వద్దని హైకోర్టు సూచించింది. ఈ కేసులో ఉన్న ప్రతి వాదులు అందరికీ [more]

Update: 2021-05-05 00:51 GMT

ఈటల రాజేందర్ కుటుంబ భూముల వ్యవహారంపై రాజమార్గంలో విచారణ జరపాలని ,బ్యాక్ డోర్ పాలసీ వద్దని హైకోర్టు సూచించింది. ఈ కేసులో ఉన్న ప్రతి వాదులు అందరికీ నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని పేర్కొంది . ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను జూలై 6 కి వాయిదా వేసింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. జమున హెచరీస్ యజమానిగా హైకోర్టులో ఈటెల భార్య పిటిషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని పేర్కొన్నారు . తాము ఎక్కడా కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ అనుమతి లేకుండా హెచరీస్ లోకి ప్రవేశించి అధికారులు హంగామా చేశారని, అనుమతి లేకుండా వెళ్ళిన మెదక్ జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి విచారణ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News