బ్రేకింగ్ : తెలంగాణాలో కేసులు తగ్గుతున్నాయ్.. ఇలాగే కొనసాగితే..?

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరుకుంది. [more]

Update: 2020-04-24 12:55 GMT

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరుకుంది. తెలంగాణాలో కరోనా వ్యాధి బారిన పడి 291 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణాలో యాక్టివ్ కేసుల సంఖ్య 663కు పేర్కొన్నారు. తెలంగాణలో కొంత వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశముందని ఈటల రాజేందర్ తెలిపారు. గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం లేదన్నారు. కంటయిన్ మెంట్ జోన్లలో పకడ్బందీగా అమలు చేస్తున్నందున ఇది సాధ్యమయిందన్నారు. ప్రజలు కూడా సహకరిస్తే తెలంగాణ నుంచి కరోనాను తరిమెయ్యడానికి ఎంతో సమయం పట్టదని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి కొందరు స్పందించడం దురదృష్టకరమని ఆయన అన్నారు

Tags:    

Similar News