లాక్ డౌన్ ను ఉల్లంఘించారో?

కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలను మరింత అలెర్ట్ చేసే దిశగా పోలీసులు టెక్నాజిని వినియోగిస్తున్నారు. వైరస్ వ్యాప్తిం చెందకుండా ఉండేందుకు హోం క్వారంటైన్స్ పరిసర [more]

Update: 2020-04-09 01:19 GMT

కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలను మరింత అలెర్ట్ చేసే దిశగా పోలీసులు టెక్నాజిని వినియోగిస్తున్నారు. వైరస్ వ్యాప్తిం చెందకుండా ఉండేందుకు హోం క్వారంటైన్స్ పరిసర ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ‘‘క్వారంటైన్ ఏరియా అలెర్ట్” పేరుతో డెవలప్ చేసిన ఫీచర్ ను ‘‘హాక్ ఐ’’ మొబైల్ యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు.ఈ ఫీచర్ ను టీఎస్ కాప్ యాప్,హాక్ ఐ యాప్ తో కనెక్ట్ చేశారు. హోం క్వారంటైన్ ఏరియాలను గుర్తించే విధంగా ఫీచర్స్ రూపొందించారు.

అలెర్ట్ తో…..

హాక్ ఐలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ కరోనా క్వారంటైన్‌ ను గుర్తిస్తుంది. ఇప్పటికే టీఎస్ కాప్ యాప్ తో జియో ట్యాగ్ చేసిన హోం క్వారంటైన్ ను 50 మీట‌ర్ల దూరం నుంచే ‘‘క్వారంటైన్ ఏరియా అలెర్ట్” ఐడెంటిఫై చేస్తుంది. దీంతో యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వ్యక్తుల మొబైల్ ఫోన్‌కు అల‌ర్ట్ వ‌స్తుంది. టీఎస్ కాప్ లో అప్ లోడ్ చేసిన క్వారంటైన్ లొకేషన్ తో మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఇది గమనించి అక్కడి నుంచి దూరంగా వెళ్తూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘‘క్వారంటైన్ ఏరియా అలెర్ట్” హాక్ ఐ యూజర్లకు అందుబాటులో ఉంది.

జియో ట్యాగింగ్ తో…..

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోం క్వారంటైన్‌లో ఉన్న సుమారు 25 వేలకు పైగా ఇళ్లను పోలీస్‌లు జియో ట్యాగింగ్ చేశారు. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు ఇల్లు వ‌దిలి 50 మీట‌ర్లు దాటి వెళ్తే పోలీస్‌ల‌కు అల‌ర్ట్ ఇస్తుంది. జియో ట్యాంగింగ్‌ను టీఎస్ కాప్ యాప్ మొబైల్ అప్లికేష‌న్‌ తో కనెక్ట్ చేశారు. దీంతో క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిరంత‌రం నిఘా కొన‌సాగిస్తున్నారు.

Tags:    

Similar News