జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం… వ్యాపారసంస్థలకు దడ

కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది. అయితే దీనిని కంట్రోల్ చేసేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు పట్టించుకోవట్లేదు. మాస్కులు [more]

Update: 2021-03-30 00:59 GMT

కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది. అయితే దీనిని కంట్రోల్ చేసేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు పట్టించుకోవట్లేదు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్ లో స్వేచ్ఛగా మాస్కులు లేకుండా కనబడుతున్నారు. అయితే షాపు యజమాని లతోపాటు షాపింగ్ మాల్స్ వ్యాపార సంస్థల్లో తప్పనిసరిగా కోవిడ్ రూల్స్ పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ వ్యాపార ప్రతినిధులు మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో జిహెచ్ఎంసి వ్యాపార సంస్థల పైన కొరడా జరిపిస్తుంది. మాస్కులు లేకుండా ఎవరినీ అనుమతించిన పక్షంలో వారిపై వ్యాపార సంస్థలకు భారీ జరిమానా విధిస్తుంది. మొదటిసారి తప్పు చేసినట్లయితే 2,000 రూపాయల జరిమానా వేసింది. రెండోసారి తప్పు చేసినట్లయితే 50 వేల రూపాయల జరిమానా విధిస్తుంది. మూడోసారి తప్పు చేసినట్లయితే నెల రోజుల పాటు వ్యాపార సంస్థలను మూసి వేసి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే బాలానగర్ ప్రాంతంలోని ఒక వ్యాపార సంస్థ మాస్కులు లేకుండా కొనుగోలుదారులను అనుమతించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా 2000 రూపాయల జరిమానాను విధించింది.

Tags:    

Similar News