మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు !
ఢిల్లీలో ఐదు కిలోల సిలిండర్ ధర రూ.655గా ఉంది. గత నెల 1న వాణిజ్య సిలిండర్‌పై రూ.268.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.
ముంబై : దేశంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.102.50 పెరిగింది. హైదరాబాద్‌లో ఆ సిలిండర్ ధర రూ.2,562.50కి చేరింది. ఢిల్లీలో రూ.2,355.50, ముంబైలో రూ.2,329.50, కోల్‌కతాలో రూ.2,477.50, చెన్నైలో రూ.2,508కి వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. ఢిల్లీలో ఐదు కిలోల సిలిండర్ ధర రూ.655గా ఉంది. గత నెల 1న వాణిజ్య సిలిండర్‌పై రూ.268.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రూ.102.50 పెరగడంతో 2 నెలల్లోనే రూ.372 పెరిగినట్లయింది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర పెరగలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1,002గా ఉండగా, కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50, ఢిల్లీలో రూ.949.50, ముంబైలో రూ.949.50గా ఉంది.
సామాన్య ప్రజలు వినియోగించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. గత నెల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటున రూ.50 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1002 వద్ద స్థిరంగా ఉంది. విజయవాడలో గృహ వినియోగ 14.2 ఎల్పీజీ సిలిండర్ ధర రూ.973గా ఉంది. విశాఖపట్టణంలో రూ.958కి లభిస్తోంది. కమర్షియల్ సిలిండర్లు పెరిగినా.. డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరగకపోవడంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించింది. అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.