బ్రేకింగ్ : రాజ్యసభలోనూ నెగ్గింది

పౌరసత్వ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విషయంలో రాజ్యసభలో ఓటింగ్ జరుగుతోంది. నిన్న లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకున్న కేంద్ర ప్రభుత్వం నేడు [more]

Update: 2019-12-11 14:49 GMT

పౌరసత్వ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విషయంలో రాజ్యసభలో ఓటింగ్ జరుగుతోంది. నిన్న లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకున్న కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఉదయం నుంచి రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. అయితే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఓటింగ్ నిర్వహించారు. రాజ్యసభలో ప్రస్తుతం 235 మంది సభ్యులు ఉన్నారు. బిల్లు మద్దతు పొందాలంటే 118 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. అయితే రాజ్యసభలో జరిగిన ఓటింగ్ లో 124 మంది సెలెక్ట్ కమిటీకి పంపొద్దంటూ ఓటు వేశారు. ప్రభుత్వానికి వీరు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందినట్లయింది. రాజ్యసభలో శివసేన ఓటింగ్ కు దూరంగా ఉంది. లోక్ సభలో మాత్రం శివసేన పౌరసత్వ సవరణ బిల్లును సమర్థించింది. టీఆర్ఎస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశాయి. వివధ సవరణలపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది.

Tags:    

Similar News