మిషన్ సక్సెస్

చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లింది. కొద్దిసేపటి క్రితం జీఎస్ఎల్వీ మార్క్ 3ఎ: 1 ర్యాకెట్ ద్వారా షార్ కేంద్రం నుంచి చంద్రుడి వైపు వెళ్లింది. 3.877 కిలోల [more]

Update: 2019-07-22 09:43 GMT

చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లింది. కొద్దిసేపటి క్రితం జీఎస్ఎల్వీ మార్క్ 3ఎ: 1 ర్యాకెట్ ద్వారా షార్ కేంద్రం నుంచి చంద్రుడి వైపు వెళ్లింది. 3.877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్ -2 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. లాంచ్ వెహికల్ నుంచి ఆర్బిటర్ విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్ – 2 సక్సెస్ అయిందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని ఆయన తెలిపారు. చంద్రుడిపైకి భారత్ చేసిన తొలి చారిత్రాత్మక ప్రయాణమని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. ప్రయోగం విజయవంతం అవ్వగానే ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ లు అభినందనలు తెలిపారు.

Similar News