మూడు రాజధానుల ఆలోచన ప్రమాదకరం

జగన్ ది తుగ్లక్ పాలన అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని చంపేయాలని చూస్తున్నారన్నారు. మూడు రాజధానులని జగన్ ప్రకటించి ప్రజలను అయోమయంలోకి నెట్టారన్నారు. మూడు [more]

Update: 2019-12-17 13:05 GMT

జగన్ ది తుగ్లక్ పాలన అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని చంపేయాలని చూస్తున్నారన్నారు. మూడు రాజధానులని జగన్ ప్రకటించి ప్రజలను అయోమయంలోకి నెట్టారన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా? అని ప్రశ్నించారు. మండలానికో ఆఫీసు పెట్టమని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇప్పుడు మూడు రాజధానులు ప్రకటించి అందరికంటే జగన్ పెద్ద బఫూన్ అయ్యారన్నారు. జగన్ అమరావతిలో ఉంటారా? విశాఖలో ఉంటారా? చెప్పాలన్నారు. ప్రజలు మూడు రాజధానులకు తిరగాలా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందన్న ఆందోళనను చంద్రబాబు వ్యక్తం చేశారు. ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరముందున్నారు. అన్నీ ఒక్కచోట ఉంటేనే ఇబ్బందులు ఎదురవుతుంటే మూడుచోట్ల రాజధానులు ఏమిటన్నారు. ఈ ఆలోచన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. జగన్ అమరావతిలో ఒక ఇల్లు, కర్నూలు, విశాఖల్లోనూ ఇళ్లు కట్టుకుంటారా? అని ప్రశ్నించారు. విశాఖలో సెక్రటేరియట్ కట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News