మోదీ ని చూసి నేర్చుకోండి
ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ సీట్లు వచ్చినా అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటున్నారని, కానీ జగన్ మాత్రం ఎవరు చెప్పినా వినరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ సీట్లు వచ్చినా అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటున్నారని, కానీ జగన్ మాత్రం ఎవరు చెప్పినా వినరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ సీట్లు వచ్చినా అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటున్నారని, కానీ జగన్ మాత్రం ఎవరు చెప్పినా వినరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారన్ారు. తమ పార్టీకి చెందిన 33 మంది ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టారన్నారు. ఒక్క అయ్యన్న పాత్రుడిపైనే ఆరు కేసులు నమోదు చేశారని చంద్రబాబు అన్నారు. ఏ వ్యవస్థనూ జగన్ సక్రమంగా ఉంచడం లేదన్నారు. రాజధాని తరలింపు విషయం కోర్టులో పెండింగ్ లో ఉండగా మళ్లీ చట్ట సభల్లోకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. జగన్ కు ఏ వ్యవస్థ అన్నా గౌరవం లేదన్నారు. ప్రజలే తిరగబడే రోజు త్వరలో వస్తుందని చంద్రబాబుఅన్నారు.