ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ ఉత్తుత్తి జీవోలు [more]

Update: 2020-05-19 02:52 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ ఉత్తుత్తి జీవోలు జారీ చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఒక్క ప్రాజెక్టు పనిని ప్రారంభించలేదన్నారు. కేసీఆర్, జగన్ లు కలసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు సినిమా డైలాగులు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ భూ భాగం మీద నుంచి ఏపీకి నీళ్లు తెచ్చేందుకు జగన్ అంగీకరించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ఫైరయ్యారు.

Tags:    

Similar News