డాక్టర్ సుధాకర్ పై వేధింపులు ఆపరా?

కోవిడ్ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాస్కులు అడగటమే నేరమయిందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ ను అవమానకరంగా అరెస్ట్ చేశారన్నారు. సుధాకర్ పై [more]

Update: 2020-05-18 02:35 GMT

కోవిడ్ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాస్కులు అడగటమే నేరమయిందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ ను అవమానకరంగా అరెస్ట్ చేశారన్నారు. సుధాకర్ పై వేధింపుల్లో భాగంగానే తాళ్లతో కట్టేసి మరీ అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు అనాగరికమని చంద్రబాబు ట్వీట్ చేశారు. డాక్టర్ అయిన సుధాకర్ ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. వారం రోజుల నుంచి సుధాకర్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.

Tags:    

Similar News