చంద్రబాబు మరో లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు లేఖల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. తాజాగా పొగాకు బోర్డు ఛైర్మన్ రఘునాధ బాబుకు చంద్రబాబు లేఖ రాశారు. లాక్ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు లేఖల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. తాజాగా పొగాకు బోర్డు ఛైర్మన్ రఘునాధ బాబుకు చంద్రబాబు లేఖ రాశారు. లాక్ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు లేఖల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. తాజాగా పొగాకు బోర్డు ఛైర్మన్ రఘునాధ బాబుకు చంద్రబాబు లేఖ రాశారు. లాక్ డౌన్ కారణంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. పొగాకు రైతులకు ఇతర ఉత్పత్తుల మాదిరిగా మార్కెట్లలో విక్రయించుకునే అవకాశం లేదని, వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని చంద్రబాబు కోరారు. ఏపీలో 124 మిలియన్ కేజీల పొగాకు నిల్వలు ఉన్నాయని తెలిపారు. మార్చి నెల నుంచి పొగాకు వేలం ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా కారణంగా జరగలేదని, తక్షణమే పొగాకు వేలం కేంద్రాలను ప్రారంభించాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.