విమర్శలు చేయడం లేదు.. అనుభవంతోనే చెబుతున్నా

ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ ను పాటించాలని, సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఆయన హైదరాబాద్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఎవరికి వారే స్వీయ నియంత్రణను [more]

Update: 2020-03-27 12:08 GMT

ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ ను పాటించాలని, సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఆయన హైదరాబాద్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఎవరికి వారే స్వీయ నియంత్రణను అవలంబించాలన్నారు. ప్రభుత్వం కూడా కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, అనుభవంతో చెబుతున్నానని చంద్రబాబు తెలిపారు. తన సూచనలను పరిగణనలోకి తీసుకుంటే ప్రజలకే మంచిదని తెలిపారు. కరోనా టెస్ట్ పరికరాలను ఎక్కువగా సిద్ధం చేయాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. పంటలను రైతుల నుంచి కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. మదనపల్లెలో టమాటాలు కుళ్లిపోయాయన్నారు. మరిన్ని రైతు బజార్లను పెట్టాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News