చీఫ్ సెక్రటరీపై చంద్రబాబు ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు చీఫ్ సెక్రటరీ లేఖ రాయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. చీఫ్ సెక్రటరీకి కరోనాపై అసలు అవగాహన ఉందా? అని ఆయన [more]

Update: 2020-03-16 12:01 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు చీఫ్ సెక్రటరీ లేఖ రాయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. చీఫ్ సెక్రటరీకి కరోనాపై అసలు అవగాహన ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా కేసు ఒక్కటేనని లైట్ గా తీసుకుంటారా? అని నిలదీశారు. అసలు ఏరోజైనా దీనిపై సమీక్షలు చేశారా? అని అన్నారు. ఎలాంటి ఏర్పాట్లు, సమీక్షలు చేయకుండా ఎన్నికలు జరపమని ఎన్నికల అధికారికి ఎలా లేఖ రాస్తారని చీఫ్ సెక్రటరీపై మండి పడ్డారు. కనీసం కరోనా గైడ్ లైన్స్ అయినా చదివారా? అని అన్నారు. కరోనాపై ముఖ్యమంత్రి జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, కనీసం సీఎస్ కు కూడా బాధ్యత లేకుంటే ఎలా? అని ఆవేదన చెందారు. ఒక్కరోజులోనే కరోనా కేసులు పెరిగిన సంగతి ఇటలీలో చూడలేదా? అని నిలదీశారు. చివరకు కోర్టులు కూడా కేసులను తగ్గించుకుంటున్నాయన్నారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారన్నారు.

Tags:    

Similar News