రాష్ట్రంలో సైకో పాలన

మీడియాపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ప్లకార్డులతో అసెంబ్లీ లోకి ప్రవేశించబోతుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలను అనుమతించేేది లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. [more]

Update: 2019-12-12 03:58 GMT

మీడియాపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ప్లకార్డులతో అసెంబ్లీ లోకి ప్రవేశించబోతుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలను అనుమతించేేది లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల సెక్యూరిటీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలా చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కనీసం టీడీఎల్పీ ఆఫీసు నుంచి పేపర్లను తీసుకువచ్చేందుకు కూడా సెక్యూరిటీ అనుమతించకపోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో పాలన సాగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. నారా లోకేష్ సయితం పోలీసులపై విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News