విశాఖలోనే వైసీపీ గుట్టు బట్టబయలు చేస్తా

వచ్చే ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఎవరు [more]

Update: 2020-02-24 12:49 GMT

వచ్చే ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి రద్దు చేసిన పథకాలను తీసుకువస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలను వైసీపీ కొనుగోలు చేయాలన్నా ఎవరూ లొంగలేదని చంద్రబాబు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించి వైసీపీకి బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో మహిళలపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. ఎల్లుండి విశాఖలో తాను పర్యటిస్తానని, అక్కడ వైసీపీ బండారాన్ని బయటపెడతానని చంద్రబాబు చెప్పారు. విశాఖలోనే వైసీపీ గుట్టును బట్టబయలు చేస్తతానని చెప్పారు.

Tags:    

Similar News