జగన్ ఉన్మాదిలా తయారయ్యారు

దేశంలోనే ఇలాంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. కోడెల శివప్రసాద్ పై 19 [more]

Update: 2019-09-17 03:36 GMT

దేశంలోనే ఇలాంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. కోడెల శివప్రసాద్ పై 19 తప్పుడు కేసులను జగన్ ప్రభుత్వం నమోదు చేసిందన్నారు. పాతకేసులను తిరగదోడారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు వేశారన్నారు. గొప్ప నేత జీవితం ఇలా ముగియడం బాధాకరమని తెలిపారు. హింసించి, వేధించడం వల్ల చనిపోతే ఏం అనాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ కిరాయి ఇంట్లో ఉంటున్నారని, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి, బెంగళూరుల్లో ప్యాలెస్ లు కట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ నేరం క్షమించరానిది….

ఈ నేరం క్షమించరానిదని చంద్రబాబు అన్నారు. కోడెల శివప్రసాద్ పై ఫర్నీచర్ దొంగతనం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఫర్నీచర్ తిరిగి ఇస్తామని, అవసరమైతే అందుకు విలువైన మొత్తాన్ని ఇస్తానని కోడెల శివప్రసాద్ చెప్పినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఫర్నీచర్ విషయంలో కోడెల నాలుగు లేఖలు రాసినా ప్రభుత్వం ఖాతరు చేయలేదన్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా, స్పీకర్ గాపనిచేసిన వ్యక్తి ఇలా మరణించడం జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు చెప్పారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ కోడెల శివప్రసాద్ ను హింసించారన్నారు చంద్రబాబు. కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురు చేశారన్నారు. కోడెల శివప్రసాద్ తప్పు చేసి చనిపోలేదని, వేధింపుల వల్లే చనిపోయారన్నారు. అవమానాలను భరించలేకనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వైసీపీ టెర్రరిస్ట్ ప్రభుత్వం గా వ్యవహరిస్తుందని చంద్రబాబు అన్నారు.

ఎంతమందిని బలితీసుకుంటారు?

తాను తప్పు చేయకపోయినా 26 కేసులు వేశారన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నన్నపనేని రాజకుమారిపైన కూడా కేసులు నమోదు చేయించారన్నారు. జగన్ ఉన్మాదిలాగా తయారయ్యాడని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎంతమందిని జగన్ బలిదీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు జగన్ కు సరెండర్ అయిపోయారన్నారు. జగన్ పాలన రాష్ట్రానికే అరిష్టమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రం ఎవరి జాగీరు కాదన్నారు. హత్యలు, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలతో ఏపీ అట్టుడికపోతుందన్నారు.

Tags:    

Similar News