సీటు కోసం బాబు ఫైటు

అసెంబ్లీ లో డిప్యూటీ లీడర్లకు సీటు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోరారు. సభా సంప్రదాయాలను పాటించాలని కోరారు. డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడుతో పాటు మిగిలిన వారికి [more]

Update: 2019-07-17 04:46 GMT

అసెంబ్లీ లో డిప్యూటీ లీడర్లకు సీటు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోరారు. సభా సంప్రదాయాలను పాటించాలని కోరారు. డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడుతో పాటు మిగిలిన వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. నిబంధన ప్రకారమే సీట్లను కేటాయించడం జరిగిందన్నారు. ఇసుకపై ప్రశ్న ముగిసిపోయినా దానిపై చర్చ జరగాలని చంద్రబాబునాయుడు కోరారు. ఇందుకు స్పీకర్ అంగీకరించలేదు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబునాయుడు వినియోగించుకోవాలని చూస్తున్నారని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సభలో రెండు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది.

Tags:    

Similar News