తెలంగాణకు మరో షాక్ ఇచ్చిన కేంద్రం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీఆర్ఎస్ [more]

Update: 2021-03-16 01:44 GMT

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ సమాధానమిచ్చారు. పసుపుతో పాటు ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారం కోసం వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో బోర్డులు ఏర్పాటు చేశామని, పసుపు బోర్డును ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ఏదీ లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తెలిపారు.

Tags:    

Similar News