రాజధానిలో బంద్

రైతులపై లాఠీ ఛార్జికి నిరసనగా రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్ వాతావరణం నెలకొంది. నిన్న అమరావతికి ముట్టడికి బయలుదేరిన రైతులపై లాఠీ చార్జి చేసిన సంగతి తెలిసిందే. [more]

Update: 2020-01-21 03:57 GMT

రైతులపై లాఠీ ఛార్జికి నిరసనగా రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్ వాతావరణం నెలకొంది. నిన్న అమరావతికి ముట్టడికి బయలుదేరిన రైతులపై లాఠీ చార్జి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పోలీసులుకు గ్రామాల్లో సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు. ఎటువంటి పదార్థాలను పోలీసులకు విక్రయించకూడదని వ్యాపారులు నిర్ణయించారు. ఈరోజు కూడా అసెంబ్లీకి వెళ్లే దారిలో పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. ప్రకాశం బ్యారేజీపైన కూడా రాకపోకలను నిషేధించారు. రాజధాని ప్రాంతంలో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉందని, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News