కోడెల మరణంపై బాలయ్య ఆవేదన

ప్రజలకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎనలేనిసేవలు చేశారని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. శారీరకంగా ఆయన లేకపోయినా మన మనస్సులో చిరస్థాయిగా ఉంటారన్నారు. [more]

Update: 2019-09-16 10:44 GMT

ప్రజలకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎనలేనిసేవలు చేశారని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. శారీరకంగా ఆయన లేకపోయినా మన మనస్సులో చిరస్థాయిగా ఉంటారన్నారు. బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. కోడెల మృతిపట్ల ఆవేదన చెందారు. బసవతారకం ఆసుపత్రి నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రికి నిధులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారని, 2000 సంవత్సరం నుంచి తొమ్మిదేళ్ల పాటు బసవతారకం ఆసుపత్రికి ఛైర్మన్ గా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.

 

 

 

Tags:    

Similar News