జనరేషన్ మారుతుంది... ఆ ఓటు బ్యాంక్...?

జనరేషన్ మారే కొద్దీ రాజకీయ నేతలు తమ పంథాను కూడా మార్చుకోవాలి. ఎక్కడైనా ఇదే సూత్రం వర్తిస్తుంది

Update: 2021-11-20 02:01 GMT

జనరేషన్ మారే కొద్దీ రాజకీయ నేతలు తమ పంథాను కూడా మార్చుకోవాలి. ఎక్కడైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎప్పుడో ఉన్న పార్టీకి పునాదులు ఏర్పరిచిన నేతలను మననం చేసుకున్నా ఫలితం ఉండదు. వారిని ఫోకస్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇది దేశ రాజకీయాల నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ పనిచేస్తుంది. అది సదరు చరిష్మా ఉన్న నేతలు మరణించిన కొద్ది కాలం వరకూ మాత్రమే ఉంటుంది. జనరేషన్ మారే కొద్దీ ఆ నేతలను కూడా మర్చిపోతారు.

ఇందిర...
ఉదాహరణకు ఇందిరాగాంధీకి పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల్లో మంచి పేరుండేది. కాంగ్రెస్ కు అదే ఓటు బ్యాంకుగా నిలిచింది. ఆమె హత్యానంతరం అది మరింత పెరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ మరణానంతరం కూడా కాంగ్రెస్ కు కొంత కాలం రాజీవ్ నామస్మరణ నడిచింది. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పటి యూత్ కు ఇందిర, రాజీవ్ ల గురించి పుస్తకాల్లో చదవడమే తప్ప వారికి పూర్తి స్థాయిలో తెలియదు. అందుకే ఓటు బ్యాంకును క్రమంగా కాంగ్రెస్ కోల్పోవాల్సి వస్తోంది.
ఎన్టీఆర్...?
ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇందిరమ్మ ఓట్లన్నీ ఎటుపోయయని ఇంకా అమాయకంగా ప్రశ్నించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబు ఎన్టీఆర్ ను పట్టుకుని ముందుకు వెళుతున్నారు. తనకు సొంత క్రేజ్ లేదు. సమర్థుడైన నాయకుడని తప్పించి యువతలో ఆయనకు గ్లామర్ లేదు. ఇప్పుడున్న జనరేషన్ కు ఎన్టీఆర్ గురించి అడిగితే జూనియర్ ఎన్టీఆర్ గురించే చెబుతారు.
వైఎస్సార్....?
కానీ చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారు. ఆయన ఏర్పరిచిన ఓటు బ్యాంకు ఇంకా ఉందన్న భ్రమలో ఉన్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మను 2014లో నమ్ముకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వైఎస్ ను క్రమంగా సైడ్ చేస్తూ వస్తున్నారు. జనరేషన్ గ్యాప్ లో పార్టీకి ఏ ఓటు పడుతుందనేది రాజకీయాల్లో ముఖ్యం. దానిని గమనిస్తూ రాజకీయాలు చేస్తేనే సక్సెస్ దరి చేరుతుంది.


Tags:    

Similar News