ఈ హత్యలో 25 మంది ప్రమేయం?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టియించిన హేమంత్ హత్య కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది .. హత్య కేసులో 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు .. [more]

Update: 2020-09-29 02:33 GMT

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టియించిన హేమంత్ హత్య కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది .. హత్య కేసులో 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు .. ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కి తరలించగా , మరో ఏడుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. హేమంత్ ను చంపడానికి రెండు నెలలుగా పథకం రచించినట్లు విచారణలో తేలింది. మరికొందరి పాత్రపై స్పెషల్ టీమ్స్ ఆరాతీస్తున్నాయి.

కొత్త కోణాలు…..

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తరువాత తీవ్ర సంచలనం సృష్టియించిన హేమంత్ హత్య కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. హేమంత్‌ హత్య కేసును పరువు హత్యగా గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో కలిసి అవంతి మేనమామ యుగందర్‌రెడ్డి , తండ్రి లక్ష్మారెడ్డి హత్య చేయించారు .. హేమంత్ కుటుంబ వల్ల తాము తల ఎత్తుకొని తిరగలేక పోతున్నాం అని అవంతి తల్లి అర్చన భర్త లక్ష్మారెడ్డి , అన్న యుగంధర్ రెడ్డి తో చెప్పింది .. దీంతో ఎలాగైనా హేమంత్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పది లక్షలు పోయినా సరే హేమంత్ బతకకకూడదు అంటూ అవంతి తండ్రి పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు యుగంధర్ రెడ్డి.

యుగంధర్ రెడ్డే అంతా….

హేమంత్ హత్య కు సంబంధించి మొత్తం నువ్వే చూసుకో అంటూ అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి , యుగంధర్ రెడ్డి కి అప్పగించాడు. దీంతో యుగంధర్ రెడ్డి తన స్నేహితుడు ఎరుకల కృష్ణ తో కలిసి మారో ఇద్దరు బిచ్చు యాదవ్, బాషాలకు సుపారీ ఇచ్చాడు. హేమంత్ ను హత్య చేస్తే పది లక్షలు ఇస్తామని , అడ్వాన్స్ గా లక్ష రూపాయలు ఇచ్చాడు .. పని పూర్తి అయ్యిక మరో తొమ్మిది లక్షలు ఇస్తామని చెప్పి వారికి సుపారీ ఇచ్చాడు .. అనుకున్నట్లే పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్ కిడ్నాప్ చేసి హేమంత్ ను హత్య చేసింది. ఈ సుపారీ గ్యాంగ్ ఎవరు అనేది కేవలం అవంతి మేనమామ యుగంధర్ రెడ్డికి మాత్రమే తెలుసు. సుపారీ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయం అవంతి తండ్రి కూడా తెలియదు. కేవలం డబ్బులు ఇవ్వడం వరకే అవంతి తండ్రి ప్రమేయం మిగిలిన వ్యవహారం మొత్తం అవంతి మేనమామ చూసుకున్నాడు అనేది పోలీసులు తేల్చారు.

ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు….

ఇక అవంతి-హేమంత్‌ ప్రేమ వ్యవహారం బయటపడటంతో 6నెలల పాటు అవంతిని బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు .. ఇక హేమంత్ తో కలవకుండా ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడు లక్ష్మారెడ్డి. జూన్‌ 10న ఇంట్లో కరెంట్‌ పోయిన సమయంలో హేమంత్ కాల్ చేసి బైక్ పైన అవంతి పారిపోయింది. అయితే ఆ సమయంలో పవర్ లేక పోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కాలేదని అవంతి తల్లిదండ్రులు పోలీసులకు అప్పట్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాత రెండు కుటుంబాలకు కౌన్సలింగ్ చేసి పోలీసులు పంపించేశారు. ఇక అదే పగ తో రగిలిపోతున్న అవంతి తల్లి , హేమంత్ హత్య చేయడానికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు విచారణ లో తేలింది.

మరికొందరి ప్రమేయం…..

హేమంత్ హత్య కేసులో ఇక అరెస్టులు పర్వం కొనసాగుతుంది .. కేవలం 18 మంది మాత్రమే ఈ కేసులో నిందితులు అనుకున్నారు కానీ పోలీసులు విచారణ చేస్తున్న కొద్దీ మరి కొంత మంది ప్రమేయం ఉన్నట్లు తేల్చారు .. మొత్తం 25 మంది ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారని తేల్చారు .. తాజాగా మరో ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మొత్తం 21 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో తాజాగా అవంతి సోదరుడు ఆశీష్ రెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. సుపారి తీసుకున్న కిరాయి హంతకులు కృష్ణా, బాషలను సైతం పోలీసులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులు కోసం గాలిస్తున్నారు పోలీసులు. నేడో రేపో నిందితులందరిని అరెస్ట్ చూపించనున్నారు. ఇక హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని , .గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ అవంతి తరుపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు .. హాంతకుల ఇంటి ముందు పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారని , బాధితుల ఇంటి దగ్గర పోలీస్ లు లేకపోవడం వెనుక అంతర్యం ఏమిటి? అని పోలీసులను ప్రశ్నించారు .. చట్టాలు,న్యాయవ్యస్త పటిష్టంగా ఉన్నంత కాలం మ్యానేజ్ చేయడం ఎవరితరం కాదు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News