జగన్ ఆ ఎత్తుగడ.. అందుకేనట

ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కూడా ఒక ఎత్తుగడను ఎంచుకున్నట్లు కనపడుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రెడీ అవుతున్నారు.

Update: 2021-11-28 02:43 GMT

తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. తమకు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఏదో ఒక అంశాన్ని బయటకు తీసుకురావాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఇదే చేస్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై వార్ ప్రకటించారు. వరి ధాన్యం కొనుగోలుపై రచ్చ చేస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం కుప్పం నియోజకవర్గం ఓటమి నుంచి జనాలను మరల్చేందుకు ఏపీలో తన కుటుంబ సంభ్యులను అవమానించారన్న అంశాన్ని హైలెట్ చేశారు.

ఈ ఇబ్బందుల నుంచి...
అంతటితో ఆగకుండా బోరున విలపించడంతో ఇప్పుడు కుప్పం ఓటమి మరుగున పడిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజధానులు బిల్లు, మండలి రద్దు బిల్లును వెనక్కు తీసుకోవడంతో జగన్ మాట మీద నిలబడరన్న చర్చ జరుగుతుంది. అప్పులు చేసి మరీ సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు సయితం బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు....
దీంతో వీటి నుంచి దృష్టి మరల్చేందుకు జగన్ కూడా ఒక ఎత్తుగడను ఎంచుకున్నట్లు కనపడుతుంది. ఇప్పడు కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ మేరకు జగన్ అధికారులను ఆదేశించారు. పదమూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. అంటే 26 జిల్లాలను ఏర్పాటు చేస్తారు. కానీ జనగణన జరగకపోవడంతో ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.
కసరత్తు ప్రారంభించాలని....
కానీ జనగణన జరగకపోయినా 26 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని ఫార్మాలటీస్ పూర్తి చేసుకుంటే జనగణన జరిగిన వెంటనే ఫాస్ట్ గా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయవచ్చని జగన్ అధికారులకు చెప్పారట. ప్రతి పార్లమెంటు కేంద్రంలో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. అధికారుల హడావిడి ఉంటే కొంత ప్రస్తుత సమస్యలను జనం దృష్టి నుంచి మరల్చవచ్చన్న జగన్ ఐడియా ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.


Tags:    

Similar News