ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

Update: 2018-08-02 12:05 GMT

రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ గురువారం సుదీర్ఘంగా జరిగింది. నాలుగు గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ‘యువనేస్తం’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని తీర్మానించారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేదం కొనసాగిస్తూ నిర్ణయించారు. వుడాను విశాఖ మెట్రో రీజియన్ డెవెలప్ మెంట్ అథారిటీగా పేరు మార్చారు. వీఎంఆర్డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామాలను తీసుకువచ్చారు. ఇక విశాక మెడ్ టెక్ జోన్ వుడాకు చెల్లించాల్సిన రూ.11 కోట్ల పన్నును మినహాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

Similar News