ఎమ్మార్వో సుజాత అరెస్ట్
షేక్ పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సుజాతను అరెస్టు చేసినట్టు ఏసీబీ తెలిపింది. ఎమ్మార్వో [more]
షేక్ పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సుజాతను అరెస్టు చేసినట్టు ఏసీబీ తెలిపింది. ఎమ్మార్వో [more]
షేక్ పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సుజాతను అరెస్టు చేసినట్టు ఏసీబీ తెలిపింది. ఎమ్మార్వో సుజాత ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించి సరైన లెక్కలు చూపి చూపించక పోవడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు . ఈ నేపథ్యంలో 30 లక్షలు సంబంధించి సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేయడం తో సుజాత ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మూడు రోజుల క్రితం సుజాత కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పదిహేను లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ తరుణంలోనే మూడు రోజుల నుంచి సుజాతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 40 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమికి సంబంధించి అధికారులు జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలపై కేసు నమోదైంది . బంజారాహిల్స్ లో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే కేసులో ఆర్ఐ నాగార్జున రెడ్డి తో పాటుగా బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ నాయక్ లను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.