యాంకర్ భర్త అరెస్ట్… ఆకేసులో?
స్టార్ యాంకర్ శ్యామల భర్త అరెస్టయ్యాడు. కోటి రూపాయలు డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శ్యామల భర్త [more]
స్టార్ యాంకర్ శ్యామల భర్త అరెస్టయ్యాడు. కోటి రూపాయలు డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శ్యామల భర్త [more]
స్టార్ యాంకర్ శ్యామల భర్త అరెస్టయ్యాడు. కోటి రూపాయలు డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శ్యామల భర్త తో పాటు మరొక లేడీ నీ అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లు ఫిర్యాదు ఫిర్యాదులో సదరు మహిళ చెప్పారు. డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు బెదిరింపులకు దిగాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు కు సైతం పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు చేశారు.సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపారని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు…నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి పంపించారు.