చంద్రబాబుపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక మళ్లీ పొత్తు కోసం వస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. [more]

Update: 2019-04-04 12:49 GMT

చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక మళ్లీ పొత్తు కోసం వస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. గురువారం జిల్లా నరసరావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా మాట్లాడుతూ… ఇప్పటికే బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తెలుసుకున్న చంద్రబాబు తమతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈసారి ఆయనను రానిచ్చేది లేదని, ఆయనకు ఎన్డీఏలో తలుపులు మూసేస్తున్నామన్నారు. ముందు నుంచీ చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేశారన్నారు. 1983కు ముందు కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన చంద్రబాబు 83 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే తన మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరారని గుర్తు చేశారు.

ఈసారి మళ్లీ కలుపుకోం

తర్వాత మామకే వెన్నుపోటు పొడిచి 1996లో ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని అన్నారు. 1999లో వాజ్ పేయి హవా ఉండటంతో బీజేపీ తో పొత్తు పెట్టుకోని చంద్రబాబు గెలిచారని అన్నారు. 2004లో బీజేపీ ఓడిపోగానే వదిలేశారని గుర్తు చేశారు. 2014లో నరేంద్ర మోడీ గెలుస్తారని భావించి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. నాలుగేళ్లు తమతో కలిసి ఉన్నాక మళ్లీ బీజేపీని వదిలేసి తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోగానే ఏపీలో మళ్లీ కాంగ్రెస్ ను ఒదిలేశారన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిచాక బీజేపీతో పొత్తు కోసం వస్తారన్నారు. కానీ, ఆయనను ఈసారి తాము రానివ్వమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News