చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జాతీయ నేతలు..?

Update: 2018-12-10 11:36 GMT

బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం మంత్రాంగం జరుపుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయవతి షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల భేటీ జరుగుతోంది. చంద్రబాబు చొరవ తీసుకుని వివిధ పార్టీల నేతలతో మాట్లాడి సమావేశానికి హాజరయ్యేలా ప్రయత్నించారు. అయితే, ఇవాళటి సమావేశానికి కీలకమైన ఇద్దరు నేతలు గైర్హాజరయ్యారు. అఖిలేష్ యాదవ్ తన పార్టీ తరపున ప్రతినిధిని మాత్రమే పంపగా, బీఎస్పీ అధినేత మాయావతి సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక ఈ సమావేశానికి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, దేవెగౌడ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మల్లిఖార్జున్ ఖర్గే, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. కూటమి కార్యాచరణతో పాటు కొత్తగా పేరు పెట్టే అంశాన్ని కూడా చర్చించనున్నారు.

Similar News