మీరు నమ్ముతారా... ఈ కుక్క ఖరీదు రూ.20 కోట్లు
ఒక కుక్క ఖరీదు ఇరవై కోట్లు.. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. దేశంలోనే అరుదైన జాతి కుక్కను హైదరాబాదీ ఒకరు విక్రయించారు.
ఒక కుక్క ఖరీదు ఇరవై కోట్లు.. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. దేశంలోనే అరుదైన జాతి కుక్కను హైదరాబాదీ ఒకరు విక్రయించారు. ఒకటిన్నర సంవత్సరాల వయసుగల ఈ కుక్కను బెంగళూరుకు చెందిన వ్యక్తి ఇరవై కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. బెంగళూరు మిర్రర్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఖరీదైన కుక్కలను సొంతం చేసుకునే వారు అనేక మంది ఉంటారు. జంతు ప్రేమికులు ముఖ్యంగా ధనికులు కుక్కలను ఎంతగానో ప్రేమిస్తారు. దాని కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. అలాంటిది ఒక మేలు జాతి శునకాన్ని ఇరవై కోట్లకు కోనుగోలు చేయడం అంటే మాటలా? కానీ ఇది నిజం అని చెబుతున్నారు.
హైదరాబాదీ వాసీ...
ఒకటిన్నర సంవత్సరం వయసు గల ఈ శునకం పేరు కాడబోమ్ హేడర్. ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పిన మాటల ప్రకారం ఇది అరుదైన జాతి కుక్క అని, హైదరాబాద్ లోని ఒక పెంపకందారుడి నుంచి కొనుగోలు చేశానని తెలిపారు. ఇటీవల త్రివేండ్రంలో జరిగిన కెన్నెల్ క్లబ్ ఈవెంట్, డాగ్ షోలో కూడా ఈ శునకం పాల్గొంది. ఈ జాతి శునకం 32 పతకాలను గెలుచుకుందని తెలిపారు.
చైనా నుంచి...
ఈ శునకం పెద్దదిగా ఉంటుందని, అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతుందని ఆయన తెలిపారు. ఈ శునకం కోసం ఏసీ గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ శునకాన్ని కొనుగోలు చేసిన సతీష్ మేలు జాతి కుక్కలు ఎక్కడ ఉన్నా కొనుగోలు చేసి వాటిని పెంచుతుంటాడు. అది అతనికి హాబీ. 2016లోనూ ఒక్కక్క శునకాన్ని కోటి రూపాయలకు రెండు కొరియన్ మాస్టిఫ్ లను సతీష్ సొంతం చేసుకున్నాడు. వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఇరవై కోట్ల రూపాయల శునకం ఉందంటే అది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.