కోటి రూపాయల లంచం అట… ఎమ్మార్వో చిక్కాడు

ఏసీబీ వలకు పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. కోటి 10 లక్షల రూపాయల లంచం పుచ్చుకుంటూ ఓ ఎమ్మార్వో పట్టుబడటం ఇదే తొలిసారి. ఓ భూ వివాదానికి [more]

Update: 2020-08-15 01:47 GMT

ఏసీబీ వలకు పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. కోటి 10 లక్షల రూపాయల లంచం పుచ్చుకుంటూ ఓ ఎమ్మార్వో పట్టుబడటం ఇదే తొలిసారి. ఓ భూ వివాదానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో లంచం మింగడం తీవ్ర సంచలనం రేపింది. రెవిన్యూ శాఖలో లంచాలు ఏ విధంగా దండుకుంటున్నారనేది ఈ సంఘటనతో ప్రస్ఫుటమవుతోంది. ఇంత లంచమా అని ఏసీబీ అధికారులే నోరెళ్ల బెట్టారంటే..రెవెన్యూ శాఖలో అవినీతి పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. కీసర మండలంలోని రాంపల్లి దయరా వద్ద ఉన్న 28 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించి.. ఇంత భారీ మొత్తంలో లంచం పుచ్చుకున్నారు కీసర ఎమ్మార్వో నాగరాజు. ఈ కేసుకు సంబంధించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.

Tags:    

Similar News