ఒక్క రోజులోనే తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు.. ఒకరి మృతి

ఈ ఒక్కరోజే తెలంగాణలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకిందని [more]

Update: 2020-03-28 13:06 GMT

ఈ ఒక్కరోజే తెలంగాణలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకిందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఆ కుటుంబంలోని వ్యక్తి నుంచే ఈ వ్యాధి సోకిందని ఈటల రాజేందర్ చెప్పారు. కుత్బుల్లాపూర్ లోనూ ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకిందన్నారు. ఖైరతాబాద్ లో 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించారని ఈటల రాజేందర్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఈ కరోనా వైరస్ సోకిందని తెలిపారు. స్వీయ నిర్భంధాన్ని పాటిస్తే కరోనాను అరికట్టవచ్చన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మంత్రి ఈటల తెలిపారు. హైదరాబాద్ లో ఎక్కడా రెడ్ జోన్ లను ప్రకటించలేదని తెలిపారు. అవన్నీ సోషల్ మీడియాలో వదంతులేనని కొట్టిపారేశారు.

Tags:    

Similar News

.